Pakshi bomma katha (పక్షి బొమ్మ కథ) | Telugu Moral Stories
పక్షి బొమ్మ (కథ) : Paksi bomma (katha)
ఏడవ తరగతి చదివే కావ్య తెలివైనది.అప్పుడప్పుడు అమ్మానాన్న ఇచ్చిన డబ్బుతో బొమ్మలు కొనుక్కుని ఖాళీ ఉన్నప్పుడు ఆడుకునేది.
ఒకసారి కావ్య వాళ్ళమ్మ ప్రక్కింటావిడతో బొమ్మల కొలువు గురించి మాట్లాడుతుండగా ఆలకించింది.
ēḍava taragati cadivē kāvya telivainadi.Appuḍappuḍu am’mānānna iccina ḍabbutō bom’malu konukkuni khāḷī unnappuḍu āḍukunēdi.
Okasāri kāvya vāḷḷam’ma prakkiṇṭāviḍatō bom’mala koluvu gurin̄ci māṭlāḍutuṇḍagā ālakin̄cindi.
కొన్ని రోజుల్లో వచ్చే దసరాకి బొమ్మల కొలువు చేయాలని, తన స్నేహితులను పిలిచి చూపించాలని అనుకుంది కావ్య. తన దగ్గర ఏయే బొమ్మలున్నాయో చూసుకుంది. తన దగ్గరున్న బొమ్మలు మాత్రం బొమ్మల కొలువు చేయడానికి సరిపోవని, మరిన్ని కొత్త బొమ్మలు కొనుక్కోవాలని అనుకుంది కావ్య. అంతలో బయట కాకి అరిచింది. కాకి అరుపు వినగానే పక్షులు, జంతువుల బొమ్మల్ని కూడ బొమ్మల కొలువులో పెట్టాలన్న కోరిక కలిగింది కావ్యకు.
Konni rōjullō vaccē dasarāki bom’mala koluvu cēyālani, tana snēhitulanu pilici cūpin̄cālani anukundi kāvya. Tana daggara ēyē bom’malunnāyō cūsukundi. Tana daggarunna bom’malu mātraṁ bom’mala koluvu cēyaḍāniki saripōvani, marinni kotta bom’malu konukkōvālani anukundi kāvya. Antalō bayaṭa kāki aricindi. Kāki arupu vinagānē pakṣulu, jantuvula bom’malni kūḍa bom’mala koluvulō peṭṭālanna kōrika kaligindi kāvyaku.
తరువాత రోజు సాయంత్రం నాన్నని బొమ్మల దుకాణానికి తీసుకువెళ్లి చిలుక, పావురం, నెమలి, కాకి, కొంగ, డేగ, గుర్రం, గాడిద, మొదలైన జంతువుల బొమ్మల్ని కొనుక్కుంది కావ్య. దసరా నాడు స్నేహితురాళ్ళని పిలిచి బొమ్మలతో కొలువు తీర్చింది. రోజంతా ఆడుకున్నారు పిల్లలు. బాగా అలసిపోయిన కావ్య అక్కడే నిద్రపోయింది. అమ్మ వచ్చి కావ్యను ఇంట్లోపలకు తీసుకువెళ్ళగా , బొమ్మలు బయట గడపలో కొలువు దగ్గరే ఉండిపోయాయి.
Taruvāta rōju sāyantraṁ nānnani bom’mala dukāṇāniki tīsukuveḷli ciluka, pāvuraṁ, nemali, kāki, koṅga, ḍēga, gurraṁ, gāḍida, modalaina jantuvula bom’malni konukkundi kāvya. Dasarā nāḍu snēhiturāḷḷani pilici bom’malatō koluvu tīrcindi. Rōjantā āḍukunnāru pillalu. Bāgā alasipōyina kāvya akkaḍē nidrapōyindi. Am’ma vacci kāvyanu iṇṭlōpalaku tīsukuveḷḷagā, bom’malu bayaṭa gaḍapalō koluvu daggarē uṇḍipōyāyi.
తరువాత రోజు ఉదయం కావ్య చూసుకుంటే వాటిలో కాకి బొమ్మ కనబడలేదు. అమ్మను అడిగితే తెలియదని చెప్పింది. నాన్న పని మీద వెళ్ళాడు. ఇంటి చుట్టూ ప్రహరీ ఉండడంతో బయటివారు తీసే అవకాశం లేదు. బొమ్మ పోవడంతో ఏడుపు వచ్చింది కావ్యకు.
Taruvāta rōju udayaṁ kāvya cūsukuṇṭē vāṭilō kāki bom’ma kanabaḍalēdu. Am’manu aḍigitē teliyadani ceppindi. Nānna pani mīda veḷḷāḍu. Iṇṭi cuṭṭū praharī uṇḍaḍantō bayaṭivāru tīsē avakāśaṁ lēdu. Bom’ma pōvaḍantō ēḍupu vaccindi kāvyaku.
అటుగా పిల్లి వెళుతుంటే ”కాకి బొమ్మను తీసావా?’ అని అడిగింది కావ్య. “పాలు తాగుతాను. ఎలుకల్ని తింటాను కానీ బొమ్మ నాకెందుకు?” అంది పిల్లి.
Aṭugā pilli veḷutuṇṭē”kāki bom’manu tīsāvā?’ Ani aḍigindi kāvya. “Pālu tāgutānu. Elukalni tiṇṭānu kānī bom’ma nākenduku?” Andi pilli.
పిల్లిని చూసి కంతలోకి దూరుతున్న ఎలుకను “నువ్వు తీసావా?” అని అడిగింది కావ్య. “తినే ఆహారం కావాలి కానీ బొమ్మ నాకెందుకు?” అనేసి దాక్కుంది ఎలుక.
Pillini cūsi kantalōki dūrutunna elukanu “nuvvu tīsāvā?” Ani aḍigindi kāvya. “Tinē āhāraṁ kāvāli kānī bom’ma nākenduku?” Anēsi dākkundi eluka.
దొడ్లో ఎవరినో చూసి మొరుగుతున్న కుక్కను అడిగింది కావ్య. “అన్నము, మాంసం ముక్కలు అయితే తింటాను. బొమ్మ నాకెందుకు?’ అంది కుక్క. కోడి, బాతులనీ అడిగింది. అవి తియ్యలేదని చెప్పాయి. కావ్య ఉసూరుమంటూ కూర్చుంది.
Doḍlō evarinō cūsi morugutunna kukkanu aḍigindi kāvya. “Annamu, mānsaṁ mukkalu ayitē tiṇṭānu. Bom’ma nākenduku?’ Andi kukka. Kōḍi, bātulanī aḍigindi. Avi tiyyalēdani ceppāyi. Kāvya usūrumaṇṭū kūrcundi.
దొడ్లో ఉన్న జామచెట్టు మీద ఒక చిలుక వాలి కావ్యను పలకరించింది. దాని మాటలకు ఉత్సాహం వచ్చింది కానీ బొమ్మ పోయిన బాధను దాచుకోలేక పోయింది కావ్య. జరిగిందంతా చిలుకతో చెప్పింది.
“నీ స్నేహితులే తీశారేమో” అంది చిలుక.
Doḍlō unna jāmaceṭṭu mīda oka ciluka vāli kāvyanu palakarin̄cindi. Dāni māṭalaku utsāhaṁ vaccindi kānī bom’ma pōyina bādhanu dācukōlēka pōyindi kāvya. Jarigindantā cilukatō ceppindi.
“Nī snēhitulē tīśārēmō” andi ciluka
“లేదు. అడగకుండా తీయరు. మేము ఆడుతుండగా ఒక కాకి బొమ్మల్ని చాలా సేపు చూసింది. అది తీసిందంటావా” అని అడిగింది కావ్య. ఆ కాకి ఆనవాళ్ళని కూడా చెప్పింది చిలుకతో.
‘ఇక్కడకు ప్రక్కనే మా అడవి. మా అడవిలో ఉన్న కాకి నువ్వు చెప్పినట్టే ఉంటుంది. దాన్ని అడుగుతాను” అనేసి ఎగిరిపోయింది చిలుక.
“Lēdu. Aḍagakuṇḍā tīyaru. Mēmu āḍutuṇḍagā oka kāki bom’malni cālā sēpu cūsindi. Adi tīsindaṇṭāvā” ani aḍigindi kāvya. Ā kāki ānavāḷḷani kūḍā ceppindi cilukatō.
‘Ikkaḍaku prakkanē mā aḍavi. Mā aḍavilō unna kāki nuvvu ceppinaṭṭē uṇṭundi. Dānni aḍugutānu” anēsi egiripōyindi ciluka.
“నా నాట్యంతో మెప్పిస్తాను తప్ప దొంగతనం తెలియదు’ అంది నెమలి. “ చేపల్ని తింటాను కానీ బొమ్మ నేనేం చేసుకోవాలి?” అంది కొంగ.
“Nā nāṭyantō meppistānu tappa doṅgatanaṁ teliyadu’ andi nemali. “Cēpalni tiṇṭānu kānī bom’ma nēnēṁ cēsukōvāli?” Andi koṅga
దాదాపు అన్ని పక్షలూ బొమ్మను తీయలేదనే చెప్పాయి. అంతవరకూ కాకి ఎక్కడికో వెళ్లడం వల్ల వెంటనే రాలేదు. తరువాత వచ్చి “నేనే కాకిని. కాకి బొమ్మ నాకెందుకు?” అంది.
“మరెవరు తీసినట్టు” అని పక్షిరాజు అంటుండగా “ పక్షులే తెచ్చాయని ఎందుకనుకుంటారు? మనుషులే తీసారేమో” అనుమానంగా చెప్పింది కాకి. అంతలో మైనా అక్కడకు వచ్చి కాకి పిల్ల కాకి దొంగిలించిన బొమ్మతో ఆటాడుతుండగా చూసానని చెప్పింది.
Dādāpu anni pakṣalū bom’manu tīyalēdanē ceppāyi. Antavarakū kāki ekkaḍikō veḷlaḍaṁ valla veṇṭanē rālēdu. Taruvāta vacci “nēnē kākini. Kāki bom’ma nākenduku?” Andi.
“Marevaru tīsinaṭṭu” ani pakṣirāju aṇṭuṇḍagā “pakṣulē teccāyani endukanukuṇṭāru? Manuṣulē tīsārēmō” anumānaṅgā ceppindi kāki. Antalō mainā akkaḍaku vacci kāki pilla kāki doṅgilin̄cina bom’matō āṭāḍutuṇḍagā cūsānani ceppindi.
పక్షిరాజు తీక్షణంగా కాకిని చూసి “నిజం చెబుతావా? దండించమంటావా?” అని అడిగింది.
కాకి “బొమ్మలతో ఆడుతున్న పిల్లల్ని చూసాక నా పిల్ల కూడా అలా ఆడాలని తెచ్చాను” అని నిజం ఒప్పుకుంది.
“మన బొమ్మల్ని కొలువులో పెట్టిందని సంతోషపడాలి కానీ బొమ్మ ఎత్తుకొస్తావా? ఆ బొమ్మను ఇచ్చేసి క్షమాపణ చెప్పేసి రా. చిలుక కూడా నీతో వస్తుంది” అని ఆదేశించింది పక్షి రాజు.
Pakṣirāju tīkṣaṇaṅgā kākini cūsi “nijaṁ cebutāvā? Daṇḍin̄camaṇṭāvā?” Ani aḍigindi.
Kāki “bom’malatō āḍutunna pillalni cūsāka nā pilla kūḍā alā āḍālani teccānu” ani nijaṁ oppukundi.
“Mana bom’malni koluvulō peṭṭindani santōṣapaḍāli kānī bom’ma ettukostāvā? Ā bom’manu iccēsi kṣamāpaṇa ceppēsi rā. Ciluka kūḍā nītō vastundi” ani ādēśin̄cindi pakṣi rāju.
The bird king looked at the crow sharply and said, “Will you tell the truth? Should I be punished? ” Asked.
Crow admitted the truth, “When I saw children playing with toys, I brought my child to play with them.”
“Glad we put our toys on the scale but will the toy pick up? Give that toy and come apologize. The parrot also comes with you, ”ordered the bird king.
చిలుక, కాకి కలసి వెళ్లి బొమ్మను కావ్యకు ఇచ్చాయి. బొమ్మ దొంగిలించినందుకు క్షమాపణ చెప్పింది కాకి. బొమ్మ దొరికినందుకు ఆనందపడిన కావ్య “దొంగతనం తప్పు కదా. అలా తియ్యకూడదని అమ్మ చెపింది. నన్నడిగితే బహుమతిగా ఇద్దును. నాకొద్దు ఆ బొమ్మ. మీ పిల్లకు నా కానుకగా తీసుకో” అని తిరిగి ఇచ్చేసింది కావ్య.
చిలుక చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఇంట్లో ఉన్న తియ్యటి పండును బహుమతిగా దానికి ఇచ్చింది కావ్య.
Ciluka, kāki kalasi veḷli bom’manu kāvyaku iccāyi. Bom’ma doṅgilin̄cinanduku kṣamāpaṇa ceppindi kāki. Bom’ma dorikinanduku ānandapaḍina kāvya “doṅgatanaṁ tappu kadā. Alā tiyyakūḍadani am’ma cepindi. Nannaḍigitē bahumatigā iddunu. Nākoddu ā bom’ma. Mī pillaku nā kānukagā tīsukō” ani tirigi iccēsindi kāvya.
Ciluka cēsina sahāyāniki kr̥tajñatagā iṇṭlō unna tiyyaṭi paṇḍunu bahumatigā dāniki iccindi kāvya.